Babu Mohan: అయ్యో బాబు మోహ‌న్..!

Babu Mohan: ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు బాబు మోహ‌న్‌కు షాక్ త‌గిలింది. స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా నామినేష‌న్ వేయాల‌ని వెళ్లిన ఆయ‌న‌కు నిరుత్సాహం ఎదురైంది. బాబు మోహ‌న్‌కు కేవ‌లం ప‌ది మంది మాత్ర‌మే మ‌ద్ద‌తు ఇచ్చారు. నామినేష‌న్‌లో ప్ర‌తిపాదితుల సంత‌కాలు లేక‌పోవ‌డంతో తిరస్క‌రించారు. దాంతో ఈసారి ఎన్నిక‌ల్లో బాబు మోహ‌న్ పోటీకి దూర‌మ‌య్యారు.

కొంత‌కాలం పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్న బాబు మోహ‌న్.. గ‌తేడాది జ‌రిగిన తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేద‌న్న కోపంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేసారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌జాశాంతి పార్టీలో చేరారు. అయితే తాను ప్ర‌జాశాంతి పార్టీలో చేర‌లేద‌ని.. కేఏ పాల్‌ను క‌ల‌వడానికి వెళ్తే ఆయ‌న పార్టీ కండువా కప్పార‌ని.. తాను పార్టీలో చేర‌కుండా అదే రోజు కేఏ పాల్‌కు గుడ్‌బై చెప్పి వ‌చ్చేసాన‌ని ట్విస్ట్ ఇచ్చారు.