Allu Arjun: పుష్ప 3 గురించి బ‌న్నీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

Allu Arjun: పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియ‌న్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా ఆయ‌న‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. పైగా టాలీవుడ్‌లో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో జాతీయ అవార్డు అందుకున్న ఏకైక న‌టుడు బ‌న్నీనే కావ‌డం విశేషం. ఆ క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడు సుకుమార్‌కే (Sukumar) వెళ్తుంది. టాప్ హీరో క‌దా ఆయ‌న‌తో ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయిస్తే ఫ్యాన్స్ ఏమ‌న్నా అనుకుంటారేమో వంటి సందేహాలు పెట్టుకోకుండా బ‌న్నీలోని పెర్ఫామ‌ర్‌ను బాగా వాడుకున్నారు. అందుకే పుష్ప ప్ర‌పంచ‌వ్యాప్తంగా వండ‌ర్స్ సృష్టించింది. ఇప్పుడు పుష్ప: ది రూల్ రెడీ అవుతోంది.

పుష్ప 2 సినిమా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వానికి రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ పుష్ప 3 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 3ని ప్రేక్ష‌కులు క‌చ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చ‌ని చెప్పారు. ఈ సినిమాకు ఆల్రెడీ పుష్ప: ది రోర్ (Pushpa: The Roar) అనే టైటిల్ కూడా రెడీగా ఉంది. పుష్ప‌ను ఒక ఫ్రాంచైస్‌గా చేయాల‌న్న ఆలోచ‌న సుకుమార్‌కు ఉంద‌ని అల్లు అర్జున్ తెలిపారు.

బెర్లిన్ ఫెస్టివ‌ల్‌లో బ‌న్నీ

కాగా.. అల్లు అర్జున్‌కు అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. జ‌ర్మ‌నీలో జ‌రుగుతున్న బెర్లిన్ ఫెస్టివ‌ల్‌లో (Berlin Film Festival) పుష్ప‌కు సంబంధించిన కొన్ని సీన్ల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీని గురించి బ‌న్నీ స్పందిస్తూ.. “” విదేశాల్లో పుష్ప సినిమాను ఆడియ‌న్స్ ఎలా స్వీక‌రిస్తారో చూడాల‌ని నాక్కూడా ఆతృత‌గా ఉంది. బెర్లిన్ ఫెస్టివ‌ల్‌లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి జోన‌ర్‌లు చూస్తారో మ‌న‌కు కూడా ఒక ఐడియా వ‌స్తుంది. నాకు తెలిసినంత వ‌ర‌కు పుష్ప థియేట‌ర్ల‌లో కంటే ఓటీటీలోనే ఎక్కువ హంగామా క్రియేట్ చేసింది. (Allu Arjun)

ఇందుకు కార‌ణం పుష్ప సినిమా కోవిడ్ కేసులు ఉండ‌గా రిలీజ్ అవ్వ‌డ‌మే అని నేను అనుకుంటున్నాను. ఇక పుష్ప 2 గురించి మాట్లాడాలంటే పుష్ప 1లో కంటే నేను విభిన్నంగా క‌నిపిస్తాను. నా క్యారెక్ట‌ర్ ఇందులో చాలా హై లెవల్‌లో ఉంటుంది. పుష్ప 1లో ప్రాంతీయంగా స‌రుకు లోడ్ చేయ‌డం మాత్ర‌మే చూసారు. పుష్ప 2లో నేష‌నల్, ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్‌లో బిజినెస్ చేయ‌డం చూస్తారు. పార్ట్ 2లో షెకావ‌త్ స‌ర్‌కి పుష్ప‌కి మ‌ధ్య విరోధం వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక నా తదుప‌రి సినిమాల గురించి చెప్పి పుష్ప హైప్‌ని త‌గ్గించాల‌ని అనుకోవ‌డం లేదు. ఇప్ప‌టికైతే నా ఫోక‌స్ అంతా పుష్ప పైనే ఉంది “” అని తెలిపారు.

పుష్ప 2 (Pushpa 2) ఫస్ట్​ గ్లింప్స్​కి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్​ వచ్చాయి.  అంతేకాదు బన్నీ బాలీవుడ్​(Bollywood) ఎంట్రీకీ ప్లాన్​ చేస్తున్నారు బాలీవుడ్​ దర్శకనిర్మాతలు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు(Bunny Vas) పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.