Pushpa 3: మూడోస్సారీ.. టైటిల్ ఇదేనా?

Pushpa 3: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) న‌టించిన పుష్ప సినిమా యావ‌త్ ప్రపంచాన్ని ఉర్రూత‌లూగించింది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ద‌ర్శ‌కుడు సుకుమార్ (sukumar) సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు.. ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసినప్పుడు పెద్ద‌గా ఇంపాక్ట్ ఏమీ క్రియేల్ కాలేదు. కానీ ఎప్పుడైతే సినిమా, పాట‌లు రిలీజ్ అయ్యాయో యావ‌త్ ప్ర‌పంచానికి పుష్ప ఫీవ‌ర్ ప‌ట్టుకుంది.

ఆ త‌ర్వాత సినిమా రిలీజ్ అవ్వ‌డం.. ఆ క్రేజ్ సినీ, రాజ‌కీయ‌, క్రీడా సెల‌బ్రిటీల వ‌ర‌కు వెళ్ల‌డం అన్నీ చ‌క‌చ‌కా అయిపోయాయి. ఈ సినిమాకి పార్ట్ 2 (pushpa 2) షూటింగ్ అవుతున్న స‌మ‌యంలోనే 2023లో జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఈ అవార్డుల్లో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు వ‌చ్చింది. టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు అందుకున్న ఏకైక న‌టుడు అల్లు అర్జున్ కావ‌డం విశేషం.

ఇప్పుడు పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన కొన్ని రోజుల‌కే పార్ట్ 3 చేద్దామ‌ని సుకుమార్, అల్లు అర్జున్ డిస్క‌స్ చేసుకున్నార‌ట‌. దాంతో పార్ట్ 3ని ఓ రేంజ్‌లో తీయాల‌ని సుకుమార్ నిర్ణ‌యించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పుష్ప మొద‌టి పార్ట్‌కి ది రూల్ (pushpa: the rule) అని పార్ట్ 2కి ది రైజ్  (pushpa: the rise) అని టైటిల్స్ పెట్టారు సుకుమార్. ఇక మూడో భాగానికి పుష్ప: ది రోర్ (pushpa: the roar) అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో కూడా పుష్ప‌: ది రోర్ అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

బ‌న్నీ త‌న డేట్ల‌న్నీ పుష్ప సినిమాకే ఇచ్చేస్తే ఇక మిగ‌తా సినిమాల్లో ఎప్పుడు న‌టిస్తారు? కొత్త ద‌ర్శ‌కుల‌కు, కొత్త జోన‌ర్ల‌కు ఎప్పుడు స‌మయాన్ని కేటాయిస్తారు? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అయితే త‌న‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టి త‌న‌కు గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టిన పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైస్‌గా మార్చ‌డంలో త‌ప్పేముంది అని బ‌న్నీ ఆలోచిస్తున్నార‌ట‌.

2021లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయింది. అప్పుడప్పుడే కోవిడ్ కాస్త త‌గ్గుతూ లాక్ డౌన్ నుంచి ఆడియ‌న్స్ బ‌య‌ట‌ప‌డుతున్న స‌మ‌యంలో రిలీజ్ అవ్వ‌డంతో థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టారు. అలా పుష్ప సెన్సేష‌న‌ల్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత మీమ్స్ పుణ్య‌మా అని మ‌రింత ఫేమ‌స్ చేసేసారు. ఇక పుష్ప 2లో బ‌న్నీ చీర క‌ట్టులో అమ్మోరు త‌ల్లి లుక్‌లో క‌నిపించేస‌రికి ఫ్యాన్స్‌కి పూన‌కాలు వ‌చ్చేసాయి.

ఇక పుష్ప-2 సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో కూడా ర‌ష్మిక మంద‌ననే  (rashmika mandanna) హీరోయిన్‌గా పెట్టారు. అయితే ర‌ష్మిక సినిమాలో చ‌నిపోతుంద‌ని.. ర‌ష్మికని చంపిన వారిని ప‌గ తీర్చుకోవ‌డానికే అల్లు అర్జున్ అమ్మోరు త‌ల్లి గెట‌ప్ వేసార‌ని అప్పుడే సీన్ల గురించి కూడా ఊహాగానాలు వినిపించేస్తున్నాయి. లేడీ గెట‌ప్‌లో అల్లు అర్జున్ చేసే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.

ఇక‌పోతే ఇటీవ‌ల సినిమాలోని కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయ‌ని పుష్ప 2 టీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆల్రెడీ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని టీం వెల్ల‌డించింది. పుష్ప 2 సినిమా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కానుంది. క‌లెక్ష‌న్లు మాత్రం పార్ట్ 1ని మించిపోతాయ‌ని ఇప్పుడే అంచ‌నాలు వేసేస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. 2025 ఉగాదికి పుష్ప 2ని అమెజాన్ ప్రైంలో రిలీజ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి పుష్ప 2ని ఒక మూడు నెల‌ల పాటు థియేట‌ర్ల‌లో ఆడించి కాస్త నిదానంగానే ఓటీటీలో ప్ర‌ద‌ర్శించాలని అనుకుంటున్నార‌ట‌.