SSMB 29: రెండు అదిరిపోయే టైటిల్స్..!

SSMB 29: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) RRRతో ఇండియాకు ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టి కొంత కాలం పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వ‌ర్క్ షాప్స్ కూడా ముగిసాయి. ప్ర‌స్తుతానికి అయితే ఈ సినిమాకు SSMB 29 అనే వ‌ర్కింగ్ టైటిల్ ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. సినిమాకు రెండు టైటిల్స్ ఫిక్స్ చేసార‌ట‌. కాస్త షూటింగ్ మొద‌ల‌య్యాక వ‌చ్చిన అవుట్‌పుట్‌ని బట్టి ఏ టైటిల్ సూట్ అయితే అది పెట్టేస్తార‌ని తెలుస్తోంది.

ఇంత‌కీ వైర‌ల్ అవుతున్న ఆ రెండు టైటిల్స్ ఏంటంటే.. ఒక‌టి మ‌హారాజా (Maharaja), రెండోది చ‌క్ర‌వ‌ర్తి (Chakravarthy). ఇదొక గ్లోబ‌ల్ అడ్వెంచ‌ర‌స్ సినిమా కావ‌డంతో టైటిల్ కూడా అదే రేంజ్‌లో ఉండాల‌ని రాజ‌మౌళి ఈ రెండు పేర్ల‌ను ఫైన‌లైజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు కాబ‌ట్టి ఏ టైటిల్ పెట్టినా కూడా అదే టైటిల్‌ను అన్ని భాష‌ల్లో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎందుకంటే డ‌బ్బింగ్ విష‌యంలో టైటిల్స్ మారిపోయి వాటి మీనింగ్ కూడా మారిపోతోంది. దాని వ‌ల్ల ఇత‌ర భాష‌ల అల్ల‌రిమూక‌లు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కి పాల్ప‌డే అవ‌కాశం ఉంది.

ఆల్రెడీ రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ (Vijayendra Prasad) సినిమాకు సంబంధించి ఎన్నో హైప్ పెంచేసే అప్డేట్స్ ఇచ్చారు. ఇదొక ఆఫ్రిక‌న్ అడ్వెంచ‌ర్ (African Adventure) సినిమా అని ఇందులో హాలీవుడ్ న‌టుడు కూడా యాక్ట్ చేయ‌బోతున్నాడ‌ని అన్నారు. అయితే ఎవ‌రా హాలీవుడ్ న‌టుడు అనే వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు. హాలీవుడ్ న‌టుడు మ‌హేష్ బాబు సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదుగా..!

అయితే గ‌తేడాది మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా SSMB 29కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ అయింది. వీడియో చూడ‌గానే జక్క‌న్న స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసి ఓ చిన్న టీజ‌ర్ రిలీజ్ చేసారేమో అనుకున్నారు చాలా మంది. కానీ అది మాస్క్ మ్యాన్ స్టూడియోస్ (Maskman Studios) వాళ్లు చేసిన ఫ్యాన్ మేడ్ టీజ‌ర్ అంట‌. నిజంగా జ‌క్క‌న్న కూడా ఇంత బాగా చూపించ‌లేరేమో అనే రేంజ్‌లో వీడియోని రూపొందించారు.

ఇండియాస్‌ బిగ్గెస్ట్ సినిమాగా SSMB29

ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపిక ప‌దుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని… విల‌న్‌గా ఆమిర్ ఖాన్ (Aamir Khan) న‌టించ‌బోతున్నార‌న్న టాక్ కూడా కొంత‌కాలం వినిపించింది. ఇదే నిజం అయితే ఈ క్రేజీ కాంబినేష‌న్‌తో SSMB29 సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా కానుంద‌ని అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రోప‌క్క ఇండోనేషియ‌న్ న‌టి కూడా ఈ సినిమాలో న‌టించ‌బోతోంద‌న్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జక్క‌న్న ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గుంటూరు కారంతో (Guntur Kaaram) ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లో ఉర్రూత‌లూగించిన మ‌హేష్ బాబును మ‌ళ్లీ తెర‌పై చూడాలంటే మాత్రం ఇంకో మూడేళ్లు ఆగాల్సిందే.