ఉద‌య్ కిర‌ణ్ చావుకు ఎవ‌రు కార‌ణ‌మో ప‌వ‌న్ చెప్పాలి

mudragada padmanabham shocking comments about uday kiran death

Mudragada Padmanabham: మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఓ నటుడికి (ఉద‌య్ కిర‌ణ్‌) సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి అతను కృంగి, కృశించి పోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం. ఆ విషయాన్ని ప‌వ‌న్ బయటికి చెప్పాలని డిమాండ్ చేసారు. ఇలాంటి ప‌ని చేసిన‌ప్పుడు బ‌య‌ట‌పెట్టాలి క‌దా అని ప్ర‌శ్నించారు. త‌న కూతురి గురించి మాట్లాడుతూ.. దుష్టుల వ‌ల్ల తాను త‌న కూతురికి దూరం అయ్యాన‌ని.. కుదిరితే వ‌చ్చే జ‌న్మ‌లో క‌లుద్దాం అప్ప‌టి వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండ‌మ్మా అంటూ ఆవేద‌నకు గుర‌య్యారు.