Mudragada: జ‌గ‌న్‌తో చెప్పి ప‌వ‌న్ ముగ్గురు భార్య‌ల‌కు ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తాను

Mudragada Padmanabham attacks pawan kalyan again

Mudragada Padmanabham: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో (Jagan Mohan Reddy) చెప్పి ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) ముగ్గురు భార్య‌ల‌కు తాను 3 సీట్లు ఇప్పిస్తానంటూ అస‌భ్య‌క‌రంగా మాట్లాడారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. తాను నిఖార్సైన కాపునని, త‌న‌ కుటుంబం కూడా స్వచ్ఛమైన కాపు కుటుంబం అని అన్నారు. పవన్ కుటుంబం స్వచ్ఛమైన కాపు అయితే చరిత్ర బయట పెట్టాలి అని అన్నారు. కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చెయ్యరా? వంగా గీత కాపు కాదా? అని ప్ర‌శ్నించారు.

మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన ఓ నటుడికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి అతను కృంగి, కృశించి పోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశార‌ని ఆ విషయాన్ని ప‌వ‌న్ బయటికి చెప్పాలని డిమాండ్ చేసారు.