క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ అక్ర‌మ సంబంధం.. కూతురు అల్లుడు బ‌లి

jealous lover kills girlfriend's daughter in ghaziabad

Ghaziabad: ప్రేమించిన మ‌హిళ‌ త‌న‌కు ద‌క్క‌లేద‌న్న కోపంతో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఎలాగైనా ప‌గ తీర్చుకోవాల‌నుకుని ఆమె కూతురిని చంపేసాడు. ఆమె అల్లుడిని గాయ‌ప‌రిచాడు. ఈ ఘ‌ట‌న ఘ‌జియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘ‌జియాబాద్‌కు చెందిన చంపాదేవి అనే మ‌హిళ‌కు 18 ఏళ్ల జ్యోతి అనే కూతురు ఉంది. జ్యోతికి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కు చెందిన ల‌లితేష్ అనే ఆటో డ్రైవ‌ర్‌కు ఇచ్చి పెళ్లి చేసింది. చంపాదేవి కొంత‌కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో జ్యోతి త‌న భ‌ర్త‌తో క‌లిసి తల్లిని చూసేందుకు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ నుంచి ఘ‌జియాబాద్‌కు వెళ్లింది. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి జ్యోతి ఇంట్లోకి బాబీ అనే వ్య‌క్తి క‌త్తితో చొర‌బ‌డ్డాడు. చంపాదేవిపై దాడి చేయ‌బోతే జ్యోతి, ల‌లితేష్ అడ్డుప‌డ్డారు. ఈ దాడిలో జ్యోతి అక్క‌డికక్క‌డే మృతిచెంద‌గా.. ల‌లితేష్‌కు గాయాలయ్యాయి.

పోలీసులు కేసును విచారించ‌గా షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. చంపాదేవి భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఆమె అదే ప్రాంతానికి చెందిన బాబి అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఆ త‌ర్వాత చంపాదేవి బాబీని దూరం పెట్టి మ‌రో వ్య‌క్తితో చ‌నువుగా ఉంటుండ‌డం బాబీ గ‌మ‌నించాడు. దాంతో త‌న‌కు ద‌క్క‌నిది ఇంకెవ్వ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌ని ఆమెను చంపాల‌నుకున్నాడు.  ఈ దాడిలో ఆరు నెల‌ల క్రిత‌మే పెళ్లి చేసుకున్న జ్యోతి బ‌లైపోయింది. ప్ర‌స్తుతం నిందితుడు బాబి బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చాడు. ఓ ప‌క్క క్యాన్స‌ర్‌తో పోరాడుతూ ఊళ్లో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటున్న చంపాను తరిమేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.