Fahadh Faasil: పుష్ప వ‌ల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు

Fahadh Faasil shocking comments on pushpa

Fahadh Faasil:  అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప సినిమా జాతీయంగానే కాకుండా అంత‌ర్జాతీయంగానూ పాపుల‌ర్ అయిపోయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో శెఖావ‌త్ స‌ర్ అనే పోలీస్ విల‌న్ పాత్ర‌లో న‌టించిన ఫాహ‌ద్ ఫాసిల్ మాత్రం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సినిమా వ‌ల్ల త‌న‌కు ఒరిగింది ఏమీ లేద‌ని అన్నారు.

“” పుష్ప సినిమా అంత‌ర్జాతీయంగానూ ఫేమ‌స్ అయివుండ‌చ్చు. కానీ ఆ సినిమా వ‌ల్ల నాకు ద‌క్కింది ఒరిగింది ఏమీ లేదు. ఈ విష‌యాన్ని నేను సుకుమార్‌కి కూడా చెప్పాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. పుష్ప సినిమాతో నేనేదో మేజిక్ చేసేస్తాను అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. నాకు సుకుమార్ అంటే గౌర‌వం ఉండ‌టం వ‌ల్ల సినిమాకు ఒప్పుకున్నాను. నేను చేయాల్సింది అంతా మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలోనే ఉంది. పుష్ప న‌న్ను ఓ న‌టుడిగా ఎక్క‌డికో తీసుకెళ్తుంది అనుకుంటే అది పొర‌పాటే “” అని తెలిపారు.