Harbhajan Singh: అత‌ని ముందు కోహ్లీ రోహిత్ కూడా ప‌నికిరారు

Harbhajan Singh lauds suryakumar yadav

Harbhajan Singh: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌త్ నుంచి టాప్ బ్యాట‌ర్లు ఎవ‌రైనా ఉన్నారంటే వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ టాప్ 1, 2 స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో కూడా సోలోగా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. అయితే.. సూర్య‌కుమార్ యాద‌వ్ నుంచి కోహ్లీ, రోహిత్ ప‌నికిరార‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు హ‌ర్భ‌జ‌న్ సింగ్. వాంఖెడె స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై సూర్య‌కుమార్ సెంచ‌రీ బాదిన త‌ర్వాత హ‌ర్భ‌జన్ ఈ కామెంట్ చేసారు.

2024 ఐపీఎల్ సీజన్‌లో సూర్య బాదిన తొలి సెంచ‌రీ ఇదే. రాత్రి వేళ‌ల్లో ప్ర‌కాశించే ఏకైక సూర్యుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది సూర్య‌కుమార్ యాద‌వే అని.. అత‌ని ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ కూడా దిగ‌దుడుపే అని అన్నారు. టీ20 క్రికెట్‌లో బెస్ట్ బ్యాట‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది సూర్య‌కుమార్ యాద‌వే అని తెలిపారు. ఒక‌వేళ సూర్య ఆడుతున్న‌ప్పుడు తాను బౌలింగ్ చేయాల్సి వ‌స్తే ఒక‌టికి మూడు సార్లు ఆలోచించేవాడనంటూ సూర్య‌కుమార్‌ను ఆకాశానికెత్తేసాడు హ‌ర్భ‌జ‌న్.