Suresh Raina: పార్టీలు చేసుకుంటే ఎలా గెలుస్తారు?

Suresh Raina: ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెల‌వని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై (Royal Challengers Banglore) స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా సెటైర్ వేసారు. పార్టీలు చేసుకునే టీం ఐపీఎల్ టైటిల్ గెలిచింది లేద‌ని అన్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడిన సురేష్ రైనా ఎందుకు త‌మ టీం అంత స‌క్సెస్ అయ్యిందో తెలిపాడు. త‌మ టీంకు ఒక రూల్ ఉంద‌ని.. అదేంటంటే.. అర్థ‌రాత్రి వ‌ర‌కు పార్టీలు చేసుకోక‌పోవ‌డ‌మే అని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రైతే ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌లేదో వారు అర్థ‌రాత్రి వ‌ర‌కు పార్టీ చేసుకునేవారని సెటైర్ వేసాడు.

“” నేను చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఉన్న‌ప్పుడు అస‌లు మేం పార్టీ చేసుకున్న‌ది లేదు. ఇప్పుడు కూడా అంతే. అందుకే మేం 5 ఐపీఎల్ ట్రోఫీలు 2 చాంపియ‌న్ లీగ్ ట్రోఫీలు సాధించాం. ముంబై ఇండియ‌న్స్ కూడా పార్టీలు చేసుకోలేదు. అందుకే 5 ట్రోఫీలు సాధించింది. ఉద‌యం మ్యాచ్ పెట్టుకుని అర్థ‌రాత్రి వ‌ర‌కు పార్టీలు చేసుకుంటే ఇంక మ్యాచ్ ఎలా ఆడ‌తారు? ఎలా గెలుస్తారు? “” అని ప‌రోక్షంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై సెటైర్లు వేసారు రైనా.

మ‌రిన్ని క్రికెట్ వార్త‌లు కోసం క్లిక్ చేయండి