Health: ఆరోగ్య‌క‌ర‌మే కానీ పోష‌కాలు ఉండ‌వ్..!

Health: చూడ‌టానికి ఆరోగ్యక‌రంగానే ఉంటాయి కానీ.. అవి తిన్నా కూడా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. ఎందుకంటే అందులో పోష‌కాలు ఉండ‌వు. అలాంటి ఆహార్ ప‌దార్థాలు ఏంటో తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్ సిరీల్స్

బ్రేక్‌ఫాస్ట్ సిరీల్స్ అని చెప్పి కార్న్ ఫ్లేక్స్, మిక్స్‌డ్ ఓట్స్ అమ్ముతూ ఉంటారు. వీటిని పాల‌ల్లో వేసుకుని తింటుంటారు. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వే అనుకుని తింటుంటాం. కానీ ఇందులో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. పైగా యాడెడ్ షుగర్స్, ఆర్టిఫిషియ‌ల్ ఫ్లేవ‌ర్లు ఎక్కువ‌గా ఉంటాయి.

బ్రౌన్ బ్రెడ్

సాధార‌ణ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్‌లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది అంటారు. కొన్ని ర‌కాల బ్రౌన్ బ్రెడ్స్‌లో మైదా క‌లుపుతారు. అందుకే నాణ్య‌మైన‌వే ఎంచుకోవాలి.

ఫ్లేవ‌ర్డ్ యోగ‌ర్ట్

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మ్యాంగో ఫ్లేవ‌ర్ల‌తో ఈ మ‌ధ్య‌కాలంలో ఫ్లేవ‌ర్డ్ యోగ‌ర్ట్‌లు ఎక్కువ‌గా అమ్మేస్తున్నారు. వీటి రుచి అమోఘంగా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. పైగా షుగ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉన్నా అన్ని వివ‌రాల‌ను పేర్కొన‌కుండా అమ్మేస్తుంటారు.

పండ్ల ర‌సాలు

బ‌య‌ట నుంచి తెచ్చుకునే జ్యూస్ ప్యాకెట్ల‌పై నేచుర‌ల్ అని రాస్తుంటారు. కానీ అవి 100% నేచుర‌ల్ కానే కాదు. చెక్క‌ర క‌లిపిన‌వే ఎక్కువ‌గా అమ్ముతుంటారు. అందుకే వీలైతే మీరే ఇంట్లో జ్యూస్ చేసుకోండి. లేదా పండ్ల‌ను అలాగే తినేయండి.

డైజెస్టివ్ బిస్కెట్లు

క్రీం బిస్కెట్ల కన్నా డైజెస్టివ్ బిస్కెట్లు మంచివంటూ మార్కెట్ల‌లో అమ్మేస్తుంటారు. ఇందులో ఎలాంటి మైదా లేకుండా పోష‌కాలు క‌లిగిన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన‌ట్లు ప్ర‌క‌టన‌లు ఇస్తుంటారు. ఇలాంటివి తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.

మ‌రిన్ని క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి