Jagan: అందుకే నేను ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించే మాట్లాడ‌తాను

jagan explains why he attacks pawan kalyan on his personal issues

Jagan: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ స‌భ‌లో అయినా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan) గురించి ప్ర‌స్తావించేట‌ప్పుడు ఆయ‌న మూడు పెళ్లిళ్ల గురించే ప్ర‌స్తావిస్తుంటారు. వ్య‌క్తిగ‌త విష‌యాల జోలికి రావ‌ద్దు అని ప‌వ‌న్ ఎన్ని సార్లు హెచ్చ‌రించినా జ‌గ‌న్ ఆ పాయింట్ మీదే పొడుస్తుంటారు. అయితే ఇలా ఎందుకు ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు అని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న ఇలా స‌మాధానం ఇచ్చారు.

“” నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అస‌లు ప‌ట్టించుకోను. అత‌ని గురించి చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాను. ఎందుకు ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించే మాట్లాడ‌తానంటే.. అత‌ను చేస్తోంది త‌ప్పు. అధికారంలో లేన‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రింత జాగ్ర‌త్త‌గా, బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఎందుకంటే అధికారంలో ఉండే రాజ‌కీయ నాయ‌కుల్ని చూసి యువ‌త స్ఫూర్తి చెందుతుంటారు. వారిని రోల్ మోడ‌ల్‌గా ఊహించుకుంటారు. ఐదేళ్లకోసారి భార్య‌ల‌ను మార్చే వ్య‌క్తి అధికారంలోకి వ‌స్తే యువ‌త‌కు ఏం సందేశ‌మిస్తున్న‌ట్లు? అత‌న్ని చూసి అత‌ను చేస్తున్న‌ది యువ‌త క‌రెక్ట్ అనుకుంటే ఎంత ప్ర‌మాదం? అందుకే ఆయ‌న పెళ్లిళ్ల గురించి ప్ర‌స్తావిస్తాను. అది త‌ప్పు అని చెప్ప‌డానికే ప‌వ‌న్ పెళ్లిళ్ల గురించి మాట్లాడ‌తాను. కానీ ఆ వ్య‌క్తి తాను చేస్తోంది త‌ప్పు అని తెలీక న‌న్నే తిడుతున్నాడు “” అని తెలిపారు.