100 మంది మ‌హిళ‌ల‌ను రేప్ చేసిన జిలేబీ బాబా మృతి

jalebi baba died after being raped by women in jail

Viral News: పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తిని చూసారా? ఇత‌ను స్వ‌యం ప్ర‌క‌టిత బాబా. ఇత‌ని పేరు అమ‌ర్‌పురి. ఈ జిలేబీ బాబా స్వ‌స్థ‌లం హ‌ర్యానా.  2017లో ఇత‌ను జిలేబీ అమ్మేవాడు. దాంతో జిలేబీ బాబాగా పేరు మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న‌ని తాను బాబాగా ప్ర‌క‌టించుకుని జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ను చేసాడు. ముఖ్యంగా ఆడ‌వాళ్ల‌ను త‌న వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భావితం చేసి త‌న మాయ‌లో ప‌డేసాడు.

అలా బాబాగా న‌మ్మించి డ‌బ్బులు సేక‌రించి ఓ ఆశ్ర‌మాన్ని కూడా క‌ట్టించాడు. ఆ ఆశ్ర‌మానికి ఎక్కువ‌గా ఆడ‌వాళ్లు వెళ్లేవారు. అలా వెళ్లిన ఆడ‌వాళ్ల‌తో త‌న లైంగిక వాంఛ‌లు తీర్చుకునేవాడు. అవ‌న్నీ కెమెరాల్లో రికార్డ్ చేసి బ‌య‌ట చెప్తే వాటిని లీక్ చేస్తాన‌ని బెదిరించేవాడు. అయితే కొంత మంది మ‌హిళ‌లు ధైర్యం చేసి అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు విచారణ చేప‌ట్ట‌గా షాకింగ్ విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఆశ్ర‌మానికి వ‌చ్చిన ఆడ‌వాళ్ల‌కు మ‌త్తు మందు క‌లిపిన టీ, పానీయాలు ఇచ్చి వారితో సెక్స్ చేసేవార‌ట‌.

ఆశ్ర‌మంలో ఉన్న మ‌గ‌వారంతా వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసేవారు. ఆ వీడియోలు పోలీసుల‌కు దొర‌క‌డంతో అత‌న్ని అరెస్ట్ చేసారు. కోర్టు ఇత‌నికి 14 ఏళ్లు శిక్ష విధించ‌గా.. నిన్న జైల్లో మృతిచెందాడు. కొంత‌కాలంగా ఇత‌ను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. నిన్న రాత్రి గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.