Diet Influencer: ఆకలికి చనిపోయింది..!
Hyderabad: డైట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏం తినాలి ఎలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటారో టిప్స్ చెప్తుంటారు. వాళ్లు చాలా జాగ్రత్తగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. వారి డైట్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా. కానీ అదే డైట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆకలికి అలమటించి చనిపోయిందంటే నమ్ముతారా? (diet influencer) రష్యాకు చెందిన 39 ఏళ్ల జాన్నాకు వీగన్ డైట్ ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు ఉంది. ఈమె చెప్పే వీగన్ డైట్ టిప్స్‌ని చాలా మంది ఫాలో అవుతుంటారు. అలాంటిది ఆమే ఆకలికి చనిపోవడంతో అంతా షాకయ్యారు.
దాదాపు పదేళ్లుగా జాన్నా పచ్చి వీగన్ డైట్ ఫాలో అవుతోంది. అంటే కూరగాయలు, పండ్లు మాత్రమే పచ్చిగా తినేసేది. దాంతో ఆమె ఇటీవల ఓ ట్రిప్‌కి వెళ్లిందట. అక్కడ అనారోగ్యానికి గురైంది. దాంతో ఆమెను స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ జాన్నా జులై 21న చనిపోయినట్లు కుటుంబీకులు ప్రకటించారు. జాన్నా ఫ్రెండ్స్ చెప్తున్న వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం అంతా కలిసి శ్రీలంక వెళ్లారట. అప్పటికే జాన్నా బక్క చిక్కిపోయి ఎముకలన్నీ ఊడిపోతాయేమో అనేలా ఉందట.
దాంతో వారంతా కలిసి జాన్నాను ఇంటికి పంపించేసారు. ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. కానీ జాన్నా వినలేదు. మళ్లీ ట్రిప్ అని చెప్పి ఫుకేట్కు వెళ్లిందట. అక్కడ జాన్నాను ఓ ఫ్రెండ్ చూసి భయపడిపోయిందట. మరో ఫ్రెండ్ చెప్పినదాని ప్రకారం.. జాన్నా తను ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేదని ఎప్పుడు లేస్తే తన మృతదేహాన్ని చూడాల్సి వస్తుందో అనేంతగా బక్కచిక్కిపోయి ఉందని అన్నారు. (diet influencer)
అయితే జాన్నా కలరా వచ్చి చనిపోయిందని ఆమె తల్లి చెప్తున్నారు. పైగా వీగన్ డైట్ పేరుతో కేవలం పండ్లు, కూరగాయలు తినే జాన్నా.. తన లైఫ్ ఇప్పుడెంతో బాగుందని ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కానీ సరైన బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా కేవలం పండ్లు కూరలు అందులో పచ్చివి తినడం వల్ల ఆమె చనిపోవడం బాధాకరం. ఇలాంటి డైట్ ఇన్ఫ్లుయెన్సర్లను ప్రమోట్ చేయకపోవడం బెటర్. జీరో ఫిగర్ పేరుతో ఏమీ తినకపోతే ఆ తర్వాత ఫిగర్ చూసుకోవడానికి ప్రాణమే ఉండదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. (diet influencer)