కార్ల‌లో క్యాన్స‌ర్ కార‌కాలు.. బ‌య‌ట‌ప‌డిన షాకింగ్ స‌ర్వే

car releasing cancer causing chemicals

Health: కార్ల లోప‌ల కొన్ని క్యాన్స‌ర్ కార‌కాలు వెలువ‌డుతున్నాయ‌ని షాకింగ్ స‌ర్వేలో బ‌య‌ట‌ప‌డింది. ఎన్విరాన్మెంట‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 2015 నుంచి 2022 వ‌ర‌కు విడుద‌లైన 101 ర‌కాల కొన్ని కార్ల‌పై రీసెర్చ్ చేప‌ట్ట‌గా దాదాపు 99 శాతం కార్ల లోప‌ల నుంచి క్యాన్స‌ర్‌ను క‌లిగించే కెమిక‌ల్స్ వెలువ‌డుత‌న్నాయ‌ని తేలింది.

కార్ల నుంచి వెలువ‌డే TCIPP అనే విష‌పూరిత‌మైన ఫ్లేమ్ రిటార్డెంట్ ఈ కార్ల నుంచి ఎక్కువ‌గా వెలువ‌డుతోంద‌ట‌. TCIPPతో పాటు TDCIPP, TCEP వంటి క్యాన్స‌ర్ క‌లిగించే విష‌పూరిత‌మైన కెమిక‌ల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయ‌ని స‌ర్వేలో తేలింది. ఇవి క్యాన్స‌ర్‌ను మాత్రమే క‌లిగించే హానికర‌మైన కెమిక‌ల్స్ కావు.. మెదడు ప‌నితీరు, సంతాన సాఫ‌ల్య‌త‌పై కూడా ప్ర‌భావం చూపుతాయ‌ట‌.

ఎక్కువగా కార్ల‌లో ప్ర‌యాణించేవారిపై ఈ ప్ర‌భావం ఉంటుంది. ఇక వేస‌వి కాలంలో కార్లలో కూర్చోగానే త‌గిలే వేడి వ‌ల్ల ఈ కెమిక‌ల్స్ మరింత స్ట్రాంగ్‌గా మార‌తాయి. కారు సీటు ఫోమ్ నుంచి ఈ కెమిక‌ల్స్ వెలువ‌డ‌తాయి. కార్లు త‌యారుచేసేవారు అగ్ని ప్ర‌మాద స‌మ‌యాల్లో కారుకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఈ కెమిక‌ల్స్ వాడ‌తార‌ట‌. అయితే ఈ కెమిక‌ల్స్ వాడాల్సిన అవ‌స‌రం లేదు అని కూడా శాస్త్రవేత్త‌లు చెప్తున్నారు.  ఎందుకంటే ఈ కెమిక‌ల్స్ వ‌ల్ల మంట‌లు అంటుకోకుండా ఉంటాయి అన‌డానికి చాలా త‌క్కువ అవ‌కాశం ఉంది. దాంతో ప్రస్తుతానికి అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేష‌న్ ఈ కెమిక‌ల్స్ లేకుండా కార్లు త‌యారీ చేయాలంటూ ప‌లు కార్ల కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసింది.