HIV విష‌యం దాచి.. 50 మంది అబ్బాయిల‌తో శృంగారం!

US man jailed for 30 years for attempting to spread HIV through sexual contact

Viral News: త‌న‌కు HIV ఉంద‌న్న విష‌యం దాచి ఇత‌రుల‌కు కూడా త‌న వ్యాధి వ్యాపించాల‌ని కుట్ర ప‌న్నాడు ఓ 36 ఏళ్ల అమెరికాకు చెందిన వ్య‌క్తి. అలెగ్జాండ‌ర్ అనే వ్య‌క్తి దాదాపు 30 నుంచి 50 మంది యువ‌కులు, కుర్రాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొన్నాడు. అయితే HIV విష‌యాన్ని వారి వ‌ద్ద దాచి పెట్టాన‌ని.. వారికి కూడా త‌న‌లాగే HIV రావాల‌ని ఇలా చేసానని కోర్టులో ఒప్పుకున్నాడు.

అలెగ్జాండ‌ర్‌పై అనుమానంతో ఓ అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌తో అత‌ని త‌ప్పు బ‌య‌ట‌ప‌డింది. ఓ అండ‌ర్‌క‌వ‌ర్ ఏజెంట్ 15 ఏళ్ల బాలుడిగా అలెగ్జాండ‌ర్‌కు ఆన్‌లైన్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. గే అయిన అలెగ్జాండ‌ర్ ఆ పిల్లాడితో ప‌రిచయం పెంచుకుని త‌న లైంగిక వాంఛ‌ను తీర్చుకోవాల‌ని అనుకున్నాడు. అలా అలెగ్జాండ‌ర్ ఆ అబ్బాయిని త‌న ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఆ అండ‌ర్‌క‌వ‌ర్ ఏజెంట్ అలెగ్జాండ‌ర్ ఇంటికి వెళ్లి అత‌న్ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. కొంత‌కాలంగా HIVతో బాధ‌ప‌డుతున్న అలెగ్జాండ‌ర్ క‌నీసం మందులు కూడా వాడ‌టం లేదు. త‌న‌లాగే ఇత‌రులు కూడా ఆ వ్యాధితో బాధ‌ప‌డాల‌ని కుట్ర‌ప‌న్నాడు. అత‌ను నిందితుడిగా తేల‌డంతో స్థానిక న్యాయ‌స్థానం అలెగ్జాండ‌ర్‌కు 30 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించింది.