Sarath Chandra: డ‌బ్బు వ‌ద్దు.. కొర‌టాల సారీ చెప్పాల్సిందే

Sarath Chandra: శ్రీమంతుడు (srimanthudu) టీమ్ త‌న‌కు రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదిర్చేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలిపారు ర‌చ‌యిత శ‌ర‌త్ చంద్ర‌. త‌న‌కు కావాల్సింది ఆ కథపై త‌న‌ హక్కని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ (koratala siva) తప్పు చేశాను అని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని శ‌ర‌త్ చంద్ర స్ప‌ష్టం చేసారు. లేదంటే కొర‌టాల శివ‌ను జైలుకి పంపిస్తాన‌ని హెచ్చరించారు.

శ్రీమంతుడు క‌థ‌ను తాను స్వాతి మ్యాగ‌జైన్‌కు రాసిన క‌థ నుంచి ఎత్తేసి కొర‌టాల శివ సినిమాగా తీసార‌ని నాంప‌ల్లి హైకోర్టులో శ‌ర‌త్ చంద్ర పిటిష‌న్ వేసారు. ఈ కేసును ప‌రిశీలించిన కోర్టు కొర‌టాల క్రిమిన‌ల్ కేసు ఎదుర్కోవాల్సిందేన‌ని తీర్పు ఇచ్చింది. దాంతో కొర‌టాల సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా.. అక్క‌డ ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించ‌లేదు.