SSMB 29 బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

SSMB 29: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu), ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి (rajamouli) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బ‌డ్జెట్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టికి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌నున్నారు. రాజ‌మౌళి కెపాసిటీ, మ‌హేష్‌బాబు స్టార్‌డంతో రూ.1000 కోట్లు పెట్టినా త‌ప్పులేద‌ని నిర్మాత‌లు కూడా అందుకు ఒప్పేసుకున్నార‌ట‌. ఇదో ఆఫ్రిక‌న్ జంగిల్ అడ్వెంచ‌ర్‌ సినిమాగా ఉండ‌బోతోందిన ఆల్రెడీ రాజ‌మౌళి వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.