Rana Daggubati: న‌న్ను చ‌ర‌ణ్‌, బ‌న్నీతో పోల్చ‌ద్దు

Rana Daggubati: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య కొద్ది పాటి విబేధాలు ఉండటం సహజమే. ఒక హీరోకు సంబంధించిన అభిమానులు మరో హీరోకు సంబంధించిన అభిమానుల మధ్య ఎప్పుడూ ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇది కొత్త కాదు. అయితే టాలీవుడ్‌లో హీరోలు పైకి కలిసే ఉన్నామని కలరింగ్ ఇస్తున్నప్పటికీ వాళ్లలో కూడా విబేధాలు తారాస్థాయిలో ఉంటాయనేది ఫిల్మ్‌నగర్ టాక్. తాజాగా రానా దగ్గుబాటి-రాంచరణ్-అల్లు అర్జున్‌ల మధ్య ఈగో క్లాష్ వచ్చిందనే వార్త ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రానా దగ్గుబాటి.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. తను ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను చేసిన సినిమాలు అందులోని పాత్రలే రానా యాక్టింగ్ స్కిల్స్ గురించి చెబుతాయి. అంతేకాదు చాలామంది ప్రేక్షకులు రానా నటనకు ఫిదా అయ్యారు కూడా. 2010లో రానా డెబ్యూ మూవీ లీడర్ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ చిత్రం గురించి వింటూనే ఉంటాం. తెలుగు సినిమా చరిత్రలో లీడర్ చిత్రం అలా నిలిచిపోతుందంతే.

ఇక రానా వ్యక్తిగత విషయానికి వస్తే తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలతో చాలా సన్నిహితంగా కనినిస్తారు. మంచి రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్‌గా పిలువబడే రాంచరణ్, అల్లు అర్జున్‌తో రానా బాండింగే వేరు. అంతేకాదు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసేందుకు ఈ త్రయం ఎప్పుడూ ముందుంటుంది. (Rana Daggubati)

ALSO READ: హీరోయిన్‌కి సారీ చెప్పిన రానా

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా దగ్గుబాటిని అక్కడి హోస్ట్ ఓ ప్రశ్న అడిగారు. అల్లు అర్జున్, రాంచరణ్‌లతో ఏమైనా ఈగో క్లాషెస్ లేదా అభద్రతా భావం మీలో ఉందా అని రానాను ప్రశ్నించారు. ఇందుకు రానా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. “ముగ్గురం ఒకేలా ఉండలేం. ఒకే సినిమా లేదా ఒకే కాన్సెప్ట్ పై సినిమాలు చేయడం లేదు. ఎవరికి వారం డిఫరెంట్ జార్నర్‌లో సినిమాలు ఎంపిక చేసుకుని చేస్తున్నాం. ఎవరి సక్సెస్ వారికుంది. అయితే కేవలం బాక్సాఫీస్ వద్ద వచ్చే నెంబర్ల ఆధారంగా ముగ్గురిని పోల్చి చూడటం తగదు. అయితే మిగితా అంశాల కూడా బేరీజు వేయాల్సిందే ” అని రానా అన్నారు.

ఇక ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 30 -40 రోజులకు ఆ సినిమా మేకింగ్ గురించి చర్చ జరుగుతుంది. ఇది చాలా ఉపయోగపడుతుందని రానా అన్నారు. ఏ హీరో సినిమా అయినా సరే దానిపై చర్చ జరుగుతుంది. అందులోని లోటుపాట్లను సైతం చర్చించడం జరుగుతుందని అంత మాత్రానా మా మధ్య విబేధాలున్నట్లు కాదని రానా తేల్చి చెప్పారు.

ఇక, రానాతో బాహుబలి నిర్మాతలు భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

విరూపాక్ష, పొలిమేర 2 లాంటి చిత్రాలు బ్లాక్ మ్యాజిక్, సూపర్ నేచురల్ అంశాలతో వచ్చి అదరగోట్టాయి. అదే తరహా కథని ఆర్కామీడియా సంస్థ భారీ బడ్జెట్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించాలని భావిస్తోంది. రానా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా వెన్నులో వణుకు పుట్టించే కథని సిద్ధం చేశారట. దర్శకుడు ఎవరు ? ఇతర తారాగణం లాంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.