Allu Arjun: పుష్ప2 కోసం బన్నీ భారీ కసరత్తులు!

Hyderabad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న తాజా చిత్రం పుష్ప2(Pushpa2). సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప: ది రూల్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఇటీవల ఒక గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై ఆసక్తి మరింత పెరిగింది.
కాగా, ఈ సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి అడవులతో పాటు జపాన్, చైనా, మలేషియా దేశాల్లో కూడా యాక్షన్ సీక్వెన్స్‌ లు చిత్రీకరిస్తున్నారని టాక్. ఈ క్రమంలో బన్నీ తన ఫిజిక్‌పై మరింతగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. జిమ్‌లో బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్ లో అల్లు అర్జున్ వర్క్ అవుట్ చేస్తున్న ఒక వీడియోని నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక పుష్ప2 గ్లింప్స్‌లో అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సినిమాలో ఇలాంటి గెటప్స్ మరో రెండు ఉన్నాయని కూడా ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్​ క్రష్​ రష్మికా మందన్నా(Rashmika Mandanna) ఈ సినిమాలోనూ శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.​