Atlee: బ‌న్నీతో సినిమా.. అంత రెమ్యున‌రేష‌నా?

Atlee: అస‌లు ఫ్లాప్ అన్న మాటే ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు అట్లీ. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు తీసిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లే. అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అట్లీతో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే బ‌న్నీతో చేయ‌బోయే సినిమాల‌కు అట్లీ తీసుకుంటున్న పారితోషికం అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు రూ.60 కోట్లు రెమ్యున‌రేష‌న్‌గా కావాల‌ని అట్లీ అడిగార‌ట‌. ఇదే నిజం అయితే.. దేశంలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఉంటారు. ఇప్ప‌టికే ఆ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఎస్.ఎస్ రాజ‌మౌలి, శంక‌ర్‌లు తీసుకుంటున్నారు.