Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ కోసం రాసారా?

Sandeep Reddy Vanga: టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అర్జున్ రెడ్డి (arjun reddy) సినిమా అటు దర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాకు, ఇటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు (vijay devarakonda) బ్రేక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కాకుండా ఇంకెవ్వ‌ర్నీ ఊహించుకోలేనంతగా ఇర‌గ‌దీసాడు మ‌న రౌడీ. అయితే ఈ సినిమా క‌థ రాస్తున్న‌ప్పుడు మైండ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) త‌ప్ప ఎవ్వ‌రూ లేర‌ని అన్నారు సందీప్ రెడ్డి వంగా.

బ‌న్నీకే క‌థ చెప్పాల‌నుకున్నా

“” నేను సాధార‌ణంగా ఒక క‌థ రాస్తున్నప్పుడు ఏ హీరోని కూడా ముందే ఊహించుకుని రాయ‌లేను. కానీ అర్జున్ రెడ్డి రాస్తున్న‌ప్పుడు మాత్రం ఎందుకో మైండ్‌లో అల్లు అర్జున్ మాత్ర‌మే ఉన్నాడు. దాంతో క‌థ‌ను ఆయ‌నకే వినిపించాల‌నుకున్నాను కానీ కుద‌ర‌లేదు. అదీకాకుండా అప్ప‌ట్లో నేను ఇండ‌స్ట్రీకి కొత్త‌. అల్లు అర్జున్ లాంటి స్టార్ నా క‌థ‌ను ఓకే చేయాలంటే ముందు నేనేంటో నిరూపించుకోవాలి “” అని తెలిపారు.

సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

అప్ప‌ట్లో ఛాన్స్ మిస్స‌యిన‌ప్ప‌టికీ ఇప్పుడు యానిమ‌ల్ సినిమాతో అల్లు అర్జున్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసిన సందీప్ రెడ్డితో బ‌న్నీ త్వ‌ర‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ అతిపెద్ద నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టి అయిన టీ సిరీస్ నిర్మించ‌నుంది.