Shubman Gill: ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ఓడిపోవడం హ్యాపీగా ఉంది

Shubman Gill: బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి గుజ‌రాత్ టైటాన్స్‌కి (Gujarat Titans) మ‌ధ్య‌ జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓడిపోయింది. అయిత ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) చేతిలో ఓడిపోయినందుకు సంతోషంగా సంతృప్తికరంగా ఉంద‌ని అన్నాడు టీం కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్. మొన్న జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం నాలుగు ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఓడిపోయింది. ఆ స‌మ‌యంలో గుజ‌రాత్ టైటాన్స్‌లోని ఆట‌గాళ్లు ప‌డిన క‌ష్టం.. వారి కృషి త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలిపాడు. కేవ‌లం ఆరు ర‌న్లు చేసి అవుట్ అయిపోయిన గిల్.. టీం పెర్ఫామెన్స్ మాత్రం సంతృప్తినిచ్చింద‌ని తెలిపాడు. కొన్నిసార్లు ఇలాంటి ఓట‌ములే భ‌విష్య‌త్తులో మ‌రింత అభివృద్ధి చెంద‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని గిల్ పేర్కొన్నాడు.