Hardik Pandya: “బాగా ఆడు..లేదా వెళ్లిపో..”

Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు మొద‌టి వార్నింగ్ అందింది. ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) యాజ‌మాన్యం పాండ్య‌ను పిలిపించి గ‌ట్టిగా క్లాస్ పీకింది. ఈసారి IPL మొద‌లైన‌ప్ప‌టి నుంచి ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ కూడా గెల‌వలేదు. దాంతో యాజ‌మాన్యం పిలిపించి కాస్త గ‌ట్టిగా చీవాట్లు పెట్టింది. ఆడితే స‌రిగ్గా ఆడు.. లేదా వెళ్లిపో అని ముఖం మీదే చెప్పేసార‌ట‌. హార్దిక్ కెప్టెన్సీని ప్రూవ్ చేసుకోవ‌డానికి ఇంకా రెండు అవ‌కాశాలు మాత్ర‌మే ఇచ్చారు. జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌ల‌లో గెల‌వ‌క‌పోతే మాత్రం హార్దిక్‌ను తొల‌గించేసి మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్‌గా నియ‌మించ‌నున్నారు.