Babu Mohan: నేను టాప్ న‌టుడ్ని.. నేనెందుకు టికెట్ అడుక్కోవాలి?

Telangana Elections: BJPపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు న‌టుడు బాబూ మోహ‌న్ (babu mohan). ఇటీవ‌ల విడుద‌ల చేసిన BJP అభ్య‌ర్ధుల జాబితాలో బాబూ మోహ‌న్ పేరు లేదు. కానీ ఆయన కుమారుడు ఉద‌య్ బాబు మోహ‌న్ టికెట్ అడిగార‌ని అందుకే ఆయ‌న‌కు ఇచ్చార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. కొన్ని వార్తా ప‌త్రిక‌ల్లో బాబూ మోహ‌న్ ఆయ‌న కుమారుడి మ‌ధ్య పోటీ, యుద్ధం అని రాసార‌ట‌. దీనిపై బాబూ మోహ‌న్ స్పందిస్తూ బాధ‌ప‌డ్డారు.

“” నాకున్న‌దే ఒక్క కొడుకు. వాడికి నాకు మ‌ధ్య ద‌య‌చేసి గొడ‌వ‌లు పెట్ట‌కండి. మీకు పాపం చుట్టుకుంటుంది. BJP లిస్ట్‌లో నా పేరు లేక‌పోతే ఏంటి? నేను టాప్ న‌టుడ్ని. ఇప్ప‌టికీ రోడ్ల‌పై నేను క‌నిపిస్తే ట్రాఫిక్ జామ్‌లు అవుతాయి. నేను మూడుస్లారు ఎమ్మెల్యేగా గెలిచాను. ఏ నటుడు కూడా ఇలా గెల‌వలేదు. నేను ఇక ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకోవ‌డంలేదు. కావాలంటే నా కొడుక్కే ఇచ్చుకోమ‌నండి. నాకేం ప్రాబ్లం లేదు. కానీ ద‌య‌చేసి నాకు, నా కుమారుడికి మ‌ధ్య విభేదాలు సృష్టించ‌కండి. నేను ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా దూరంగా ఉంటాను. నా వ్యాఖ్య‌ల‌కు BJP ఎలా స్పందిస్తుందో దానిని బ‌ట్టి నేను పార్టీలో కొన‌సాగాలా లేదా రాజీనామా చేయాలా అనేది నిర్ణ‌యించుకుంటాను. నా బాధ నాకు టికెట్ ఇవ్వ‌నందుకు కాదు. ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో నిర్ణ‌యించాల్సింది హైక‌మాండే. కానీ నాకు టికెట్ ఇవ్వ‌డంలేద‌ని క‌నీసం నాకు ఒక‌మాట చెప్పాలి క‌దా. అది కూడా చెప్ప‌లేదంటే అంత త‌ప్పు ఏం చేసాను? “” అని తెలిపారు బాబు మోహ‌న్ (babu mohan)