పుచ్చ‌కాయ‌తో మ‌గ‌వారిలో సంతాన సాఫ‌ల్య‌త పెరుగుతుందా?

Watermelon: వేస‌విలో పుచ్చ‌కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. పుచ్చ‌కాయ కేవ‌లం వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే పండుగా చూస్తాం కానీ ఇది మ‌గ‌వారిలో సంతాన సాఫ‌ల్య‌తను పెంచే ఔష‌దం అని అంటున్నారు వైద్య నిపుణులు. పుచ్చ‌కాయ‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి ప‌చ్చిది మ‌రొక‌టి బాగా పండినంది. ప‌చ్చి పుచ్చ‌కాయ‌తో వంట‌లు కూడా చేస్తుంటార‌ట.

పుచ్చ‌కాయ‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌లో ఉండే లైకోపీన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మ‌గ‌వారిలో వీర్య క‌ణాల కౌంట్‌ను బాగా పెంచుతాయ‌ని ఓ నివేదిక‌లో తేలింది. అంతేకాదు ఈ లైకోపీన్ వ‌ల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి కూడా త‌గ్గిపోతుంది. ఈ ఒత్తిడి వ‌ల్లే వీర్య క‌ణాల క్వాలిటీ, కౌంట్ త‌గ్గిపోతుంది. ఈ ఒత్తిడి వ‌ల్ల ఆల్రెడీ పాడైన వీర్య క‌ణాల క్వాలిటీని పుచ్చ‌కాయ‌లో ఉండే నైట్రిక్ ఆక్జైడ్ బాగ‌య్యేలా చేస్తుంద‌ట‌.

విట‌మిన్ ఏ, బి6, సి, పొటాషియం పుచ్చ‌కాయ‌లో ఎక్కువ‌గా ఉంటాయి. లైంగిక జీవితం బాగుండాలంటే ఈ విట‌మిన్లే ఎంతో కీల‌కం. ఇవ‌న్నీ పుచ్చ‌కాయ‌లో ఉన్నాయి కాబ‌ట్టి మ‌గ‌వారిలో సంతాన సాఫల్య‌త వృద్ధి చెందుతుంద‌ని వైద్యులు చెప్తున్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు చ‌ద‌వ‌డానికి క్లిక్ చేయండి