Milk: గేదె పాల కంటే ఆవు పాలు మంచివా?

పాల‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముక‌లను దృఢంగా మార్చ‌డంలో పాలు (milk) సాయ‌ప‌డ‌తాయి. అయితే ఉద‌యాన్నే పాలు తాగేవారు, ఆ పాల‌తో చేసుకున్న టీ, కాఫీలు తాగేవారు ఉంటారు. సాధార‌ణంగా అయితే అంద‌రూ గేదె పాల‌నే ఎక్కువ‌గా తాగుతుంటారు. ఆవు పాల‌ను అప్పుడప్పుడు పండుగ‌ల స‌మ‌యంలో వాడుతుంటారు. ఆవు పాల‌ను రోజూ తాగ‌చ్చా? రోజూ తాగేందుకు ఆవు పాలు (cow milk) మంచివా లేక గేదె పాలు (buffalo milk) మంచివా?

*గేదె పాల కంటే ఆవు పాల‌ల్లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. కాక‌పోతే ఆవు పాలు రోజూ తాగితే వేడి చేస్తుంది.

*గేదె పాల‌తో పోలిస్తే ఆవు పాల‌ల్లో కేలొరీలు త‌క్కువ‌గా ఉంటాయి.

*ఆవు పాలల్లో విట‌మిన్ ఏ గేదె పాల కంటే పుష్క‌లంగా ఉంటుంది. (milk)

*ఆవు పాల‌ల్లో ఉండే ప్రొటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ త‌క్కువ కాకుండా స‌మానంగా ఉంటాయి.

*ఆవు పాలు సులువుగా జీర్ణం అవుతాయి.

*ఆవు పాల‌ల్లో త‌క్కువ కొవ్వు ఉంటుంది. ఆల్రెడీ ఎక్కువ కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు గేదె పాల బ‌దులు ఆవు పాలు తీసుకోవ‌డం మంచిది. (milk)

ఇది స‌మాచారం ఇవ్వ‌డం కోస‌మే రాసిన ఆర్టిక‌ల్. ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధించి వైద్యుల స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మం