40 దాటిన మహిళలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Hyderabad: 40 ఏళ్లు దాటిన మహిళల్లో(women) శారీరకంగానూ, మానసికంగానూ చాలా మార్పులు వ‌స్తాయి. అనేక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్ సంబంధిత లక్షణాలు కనపడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. 40 ఏళ్ల వయస్సు మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం..

* పీరియ‌డ్ సమయంలో ప్రోటీన్​ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం తప్పనిసరి.
* 40 ఏళ్లు పైబడిన మహిళలకు విటమిన్​ B చాలా అవసరం. తినే ఆహారం నుంచి శక్తిని పొందడానికి, ఎర్ర రక్త కణాలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి.
* మహిళలు వయస్సుతో ఎముకల సాంద్రతను కోల్పోతారు. అందువల్ల కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
* విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. కాబట్టి మహిళలు దానిని తగినంత మొత్తంలో పొందడం చాలా ముఖ్యం.
* ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇనుము లోపం అనీమియా (IDA) సమస్య ఏర్పడుతుంది.