JR NTR: ఓయ్‌.. న‌న్ను వ‌దిలేయండి

JR NTR: బాలీవుడ్ మీడియా సెల‌బ్రిటీల‌ ఫోటోలు, వీడియోల కోసం ఎంత‌దాకైనా వెళ్తారు. ప‌గ‌లు, రాత్రి అనేవి లేకుండా ముంబై ఎయిర్‌పోర్ట్‌లోనే కొంద‌రు ఫోటోగ్రాఫ‌ర్లు, వీడియోగ్రాఫ‌ర్లు డ్యూటీ చేస్తుంటారు. దాంతో వారిని కంట్రోల్ చేయ‌డం సెల‌బ్రిటీల వ‌ల్ల కాక‌.. ఇక చేసేదేమీ లేక వారికి కావాల్సిన ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్లిపోతుంటారు. మ‌న టాలీవుడ్‌లో అలా ఎక్క‌డికి వెళ్లినా వెంబ‌డించేంత సీన్ లేదు. ఈ బాలీవుడ్ మీడియాతో విసిగిపోయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఇక భ‌రించ‌లేక వారిపై అరిచేసారు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వార్ 2 (War 2) సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ తీస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోష‌న్ కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో బిజీగా ఉన్న తార‌క్ హైద‌రాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తున్నారు. మొన్న ముంబైలో ప్రైవేట్ ట‌ర్మిన‌ల్‌లో తార‌క్ ల్యాండ్ అయిన‌ప్పుడు కూడా ఫోటోగ్రాఫ‌ర్లు అక్క‌డికి వెళ్లిపోయారు. దాంతో వీరికి ఎలా తెలిసింది అని తార‌క్ షాక‌య్యారు. నిన్న ముంబైలోని ఓ హోట‌ల్‌కు తార‌క్ వెళ్తుంటే.. ఓ ఫోటోగ్రాఫ‌ర్ తార‌క్‌తో పాటు హోట‌ల్‌లోకి వెళ్లేందుకు ప్రయ‌త్నించాడు. దాంతో స‌హ‌నాన్ని కోల్పోయిన తార‌క్.. ఓయ్.. న‌న్ను వ‌దిలేయండి ప్లీజ్ అని గ‌ట్టిగా అరిచేసాడు. తార‌క్ అలా కోప‌డ‌టంతో వారు కూడా కాస్త భ‌య‌ప‌డ్డారు.