Samantha: పెళ్లి గౌను.. కొత్త‌గా మెరిసెను..!

Samantha: స‌మంత త‌న పెళ్లి గౌనుని ఇంకాస్త కొత్త‌గా డిజైన్ చేయించుకుని మ‌ళ్లీ వేసుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. నాగ‌చైత‌న్య‌తో పెళ్లి జరిగిన స‌మ‌యంలో క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం సామ్ తెల్ల గౌను వేసుకున్నారు. ఇప్పుడు అదే గౌనును ఇంకాస్త కొత్త‌గా డిజైన్ చేయించి దానికి న‌లుపు డై వేయించి మ‌ళ్లీ వేసుకుని ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వేసుకున్న పాత దుస్తుల్నే మ‌ళ్లీ కొత్త‌గా వేసుకున్నాన‌ని ఇందుకు డిజైన‌ర్ క్రేషా బ‌జాజ్ సాయం చేసార‌ని పేర్కొన్నారు.