Kodali Nani నామినేష‌న్ ర‌ద్దు?

Kodali Nani: గుడివాడ YSRCP ఎమ్మెల్యే కొడాలి నాని నామినేష‌న్ ర‌ద్దు చేయాల‌ని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేత‌లు రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. నామినేష‌న్‌లో త‌ప్పుడు స‌మాచారం పెట్టార‌ని మున్సిప‌ల్ ఆఫీస్‌ను కొడాలి నాని క్యాంప్ కార్యాల‌యంగా మార్చుకున్నార‌ని ఆరోపించారు. కానీ అఫిడ‌విట్‌లో మాత్రం తాను ఏ ప్ర‌భుత్వ కార్యాల‌యాన్ని వినియోగించుకోలేద‌ని పేర్కొన్నార‌ని వెంట‌నే ఆ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించాల‌ని రిక్వెస్ట్ చేసారు. ఇక రాజంపేట అభ్య‌ర్ధి మిథున్ రెడ్డి నో డ్యూ స‌ర్టిఫికేట్ దాఖ‌లు చేయ‌లేద‌న్న ఫిర్యాదు కూడా చేసారు. దాంతో మిథున్ రెడ్డి నామినేష‌న్‌ను కూడా తిర‌స్క‌రించాల‌ని వారు కోరారు. ఈరోజు నామినేష‌న్ల‌ను ప‌రిశీలించి ఏవి చెల్లుతాయో ఏవి చెల్ల‌వో రిట‌ర్నింగ్ అధికారి వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.