ధోనీ ఏం పీకాడని.. భ‌జ్జీ ఫైర్

Harbhajan Singh: మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్.. మ‌రోసారి మ‌హేంద్ర సింగ్ ధోనీపై (MS Dhoni)  సెటైర్లు వేసారు. మంగ‌ళ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్ ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో త‌న‌య్ తివారీ అనే యాంక‌ర్ ధోనీపై ప్రశంస‌లు కురిపించాడు. ధోనీ ఒక్క సిక్స్ కొట్ట‌గానే త‌న‌య్ తివారీ సెంచ‌రీ బాదిన‌ట్లు తెగ పొడిగేసాడు. దాంతో ప‌క్క‌నే ఉన్న భ‌జ్జీకి ఒళ్లు మండింది. “” అంతగా ఏం పీకాడ‌ని.. ఆ సిక్సులు కీర‌న్ పోలార్డ్ కూడా బాదాడు కదా. ఒక చేత్తో సిక్స్ బాద‌డం అనేది పెద్ద విష‌యం ఏమీ కాదు. ఆటలో అది స‌హ‌జ‌మే “” అని క్లాస్ పీకాడు.

హ‌ర్భ‌జన్‌కి ధోనీ ప‌ట్ల ఎలాంటి అసూయ లేదు కానీ.. వ‌ర‌ల్డ్ క‌ప్ కేవ‌లం ధోనీ వ‌ల్లే సాధ్యం అయ్యింద‌ని.. ధోనీ త‌ప్ప ఇంకెవ్వ‌రూ ఆడ‌లేద‌ని చాలా మంది అంటుండంతో హ‌ర్భ‌జ్‌న‌కు న‌చ్చ‌లేదు. అందుకే ధోనీ విష‌యంలో భ‌జ్జీ కాస్త కోపంగా ఉంటాడు. తాను కూడా భార‌తీయ క్రికెట‌ర్‌నే అని అది కూడా ప్ర‌జ‌లు గుర్తించాలని అంటుంటాడు.