Shreyas Iyer: మ్యాచ్ స‌మ‌యంలో అంద‌మైన అమ్మాయిని చూసా

Shreyas Iyer: సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో ఏ క్రికెట‌ర్ అయినా సిక్స్ కానీ ఫోర్ కానీ బాదిన‌ప్పుడు కెమెరామ్యాన్ వెంట‌నే ఆడియ‌న్స్ కేరింత‌ల‌ను చూపిస్తుంటాడు. చాలా మంది త‌మ అభిమాన క్రికెట‌ర్ల ప్ల‌కార్డులు ప‌ట్టుకుని కెమెరాల‌కు పోజులిస్తుంటారు. అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు.. అత‌ను మ్యాచ్ ఆడుతుండ‌గా స్టాండ్స్‌లో ఓ అంద‌మైన అమ్మాయిని చూసాడ‌ట‌. ఆమెకు శ్రేయ‌స్ హాయ్ కూడా చెప్పాడు. ఆ స‌మ‌యంలో ఫేస్‌బుక్ చాలా పాపుల‌ర్ అవ‌డంతో త‌ర్వాత ఇంటికెళ్లి త‌న‌కు ఆ అమ్మాయి నుంచి మెసేజ్ కానీ రిక్వెస్ట్ కానీ వ‌స్తుందేమో అని తెగ చెక్ చేసాడ‌ట‌. కానీ రాలేద‌ని నిరుత్సాహ‌ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తాను అస‌లు స్టాండ్స్‌లో ఉన్న ఎవ్వ‌రినీ కూడా చూడ‌న‌ని చూసినా పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని తెలిపాడు.