Allu Arjun: నా స‌పోర్ట్ ఎప్పుడూ మీకే..ప‌వ‌న్‌ని ఉద్దేశిస్తూ బ‌న్నీ ట్వీట్

allu arjun extends his support to pawan kalyan

Allu Arjun: ఇంట్లో వాడిగా నా మ‌ద్దతు ఎప్పుడూ మీకే అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇంకో నాలుగు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బ‌న్నీ ట్వీట్ చేసారు. మీ రాజ‌కీయ ప్ర‌యాణం ప‌ట్ల నా అభినందన‌లు తెలుపుతున్నాను. మీరు ఎంచుకున్న మార్గాన్ని నేను ఎప్పుడూ గౌర‌విస్తూనే ఉన్నాను. ఇంట్లో వాడిగా నా మ‌ద్ద‌తు, ప్రేమానురాగాలు ఎప్పుడూ మీకు ఉంటాయి. మీరు అనుకున్న‌ది సాధించాల‌ని నేను బ‌లంగా కోరుకుంటున్నాను అని తెలిపారు.