Hardik Pandya గాయాన్ని దాస్తున్నాడు… మాజీ క్రికెట‌ర్ షాకింగ్ వ్యాఖ్య‌లు

Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు గాయం అయింద‌ట‌. ఈ విష‌యాన్ని దాచి పెట్టి మ‌రీ గేమ్ ఆడుతున్నాడ‌ని మాజీ న్యూజిల్యాండ్ క్రికెట‌ర్ సైమన్ డోల్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. సైమ‌న్ ఈ విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్ట‌డానికి కార‌ణం మొద‌టి రెండు ముంబై ఇండియ‌న్స్ ఆడిన మ్యాచ్‌ల‌లో హార్దిక్ బౌలింగ్ చేసాడ‌ని.. ఆ త‌ర్వాత రెండు మ్యాచ్‌ల‌లో బౌలింగ్ చేసేందుకు నిరాక‌రించాడ‌ని గాయం కావ‌డంతోనే బౌలింగ్ చేయ‌డంలేద‌ని సైమ‌న్ ఆరోపిస్తున్నారు.

నిన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఒక ఓవ‌ర్‌లో మాత్రమే బౌలింగ్ చేసాడ‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ చేయ‌లేద‌ని సైమ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. హార్దిక్‌కి క‌చ్చితంగా ఏదో అయ్యింద‌ని కానీ దాచిపెడుతున్నాడ‌ని త‌న‌కు స్ట్రాంగ్‌గా అనిపిస్తోంద‌ని సైమ‌న్ తెలిపారు. మ‌రి దీనిపై హార్దిక్ ఏమంటాడో వేచి చూడాలి. గ‌తంలో కూడా మొద‌టి ఐపీఎల్ మ్యాచ్ గెలిచాక హార్దిక్ బౌలింగ్ చేయ‌క‌పోవ‌డంపై స్పందించాడు. త‌నకు బౌలింగ్ చేయాల్సిన అవ‌స‌రం స‌రైన స‌మ‌యం రాలేదు కాబ‌ట్టే చేయ‌లేద‌ని క‌ప్పి పుచ్చుకున్నాడు.