ZeroPe App: ఇక వైద్యం చేయించుకోవ‌డానికీ లోన్స్.!

ZeroPe App: చ‌దువుకోడానికి, ఇల్లు క‌ట్టుకోవ‌డానికి మాత్ర‌మే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. త్వ‌ర‌లో వైద్యం చేయించుకోవ‌డానికి కూడా లోన్లు తీసుకోవ‌చ్చు. భార‌త్‌పే స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆష్నీర్ గ్రోవ‌ర్ జీరో పే యాప్ ద్వారా ఈ మెడిసిన్ లోన్ సౌక‌ర్యాన్ని త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ప్ర‌స్తుతానికి ఈ లోన్ యాప్ టెస్టింగ్ ద‌శ‌లో ఉంటుంది. అందుబాటులోకి వ‌చ్చాక ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ల‌భిస్తుంది. వైద్య అవ‌స‌రాల కోసం దాదాపు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ తీసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్నారు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ముకుట్ ఫిన్‌వెస్ట్ అనే NBFCతో ఆష్నీర్ భాగ‌స్వామ్యం అయ్యారు.

అయితే జీరో పే యాప్ భాగ‌స్వామ్యం అయిన హాస్పిట‌ల్స్‌లో మాత్ర‌మే ఈ లోన్ స‌దుపాయం ఉంటుంది. ఇందుకోసం యూజర్లు ఏం చేయాలంటే.. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అప్లికేష‌న్ ఫాంలో వివ‌రాలు న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత వెంట‌నే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ వ‌స్తుంది. ఆల్రెడీ మెడిసిన్ లోన్స్ ఇస్తున్న సంస్థ‌ల‌తో ఆష్నీర్ భాగ‌స్వామ్యం కానున్నారు.