Meta: ఇండియాలో వాట్సాప్ బంద్ చేస్తాం

Meta: ఇండియాలో వాట్సాప్ (Whatsapp) సేవ‌ల‌ను రద్దు చేస్తామని య‌జ‌మాన కంపెనీ మెటా వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ ఎన్‌క్రిప్ష‌న్‌ను బ‌ల‌వంతంగా బ్రేక్ చేయాల్సి వ‌స్తే ఇండియాలో వాట్సాప్ ఇక ప‌నిచేయ‌ద‌ని మెటా ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఉంది కాబ‌ట్టే చాలా మంది ప్రైవ‌సీ కోసం యాప్ వాడుతున్నార‌ని.. అలాంటి ప్రైవ‌సీనే తీసేయ‌మంటే కుద‌ర‌ని ప‌ని అని తేల్చి చెప్పింది.

అయితే ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రూల్స్, 2021 యాక్ట్ ప్ర‌కారం కోర్టు ఎప్పుడు అవ‌స‌రం వ‌చ్చి అడిగినా ఎవ‌రు ముందు మెసేజ్ చేసారో చెప్పాల్సిన బాధ్య‌త వాట్సాప్‌కి ఉంద‌ని పిటిష‌న్ వేసారు. ఈ పిటిష‌న్‌పై మెటా త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ.. అలా ఎవ‌రు ముందు మెసేజ్ పంపారో తెలుసుకోవాలంటే కోట్లాది మెసేజ్‌లు స్టోర్ చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని.. ఇది యూజ‌ర్ల ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. అంత దాకా వ‌స్తే భార‌త్‌లో వాట్సాప్ సేవ‌లు నిలిపివేసేందుకు కూడా మెటా సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు.