Kannappa: ప్ర‌భాస్ అడుగెట్టేసాడు..!

prabhas joins kannappa

Kannappa: చాలా కాలం త‌ర్వాత మంచు విష్ణు క‌న్నప్ప అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇందుకోసం అన్ని ఇండ‌స్ట్రీల‌కు చెందిన టాప్ న‌టుల‌ను ఎంపిక‌చేసారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. పోస్ట‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఇందులో ప్ర‌భాస్ శివుడి పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచే ప్ర‌భాస్‌కి సంబంధించిన షూటింగ్ మొద‌లైంద‌ని టీం వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ విష‌యానికొస్తే.. ముందు కృతిస‌న‌న్ సోద‌రి నుపూర్ స‌న‌న్‌ను ఎంపిక‌చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల నుపూర్ స‌న‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఈసారి మంచు విష్ణు ఏదో గ్రాండ్‌గానే ప్లాన్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.