Samantha ఇన్‌స్టాలో చై పిక్స్..!

స‌మంత (samantha) నాగచైత‌న్య‌లు (naga chaitanya) విడిపోవ‌డం ఇప్ప‌టికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకుని పెద్ద‌ల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్న వారు ఇలా నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇందుకు కార‌ణం ఏంట‌నేది మ‌న‌కు అన‌వ‌స‌రం అనుకోండి..! అయితే చైతో విడాకులు అయ్యాక సామ్ త‌న ఇన్‌స్టాలో చైకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా ఉంచ‌లేదు. అన్నీ డిలీట్ చేసేసింది.

ఆ త‌ర్వాత విడిపోతున్న‌ట్లు పెట్టిన పోస్ట్‌ను కూడా డిలీట్ చేసేసింది. ఇక వీరిద్ద‌రూ ఎప్ప‌టికీ క‌లుసుకోరేమో అనేంత‌గా వీరి మ‌ధ్య దూరం పెరిగింద‌ని అంద‌రికీ అర్థ‌మైపోయింది. అయితే ఇప్పుడు సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చైతో దిగిన పిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. క్రిస్టియ‌న్ త‌ర‌హాలో పెళ్లి జ‌రిగిన‌ప్పుడు సామ్ చైని హ‌గ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న ఫోటోల‌తో పాటు మ‌రికొన్ని ప‌ర్స‌న‌ల్ ఫోటోలు కూడా క‌నిపిస్తున్నాయి. దాంతో త్వ‌ర‌లో క‌లిసిపోతారేమో అని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. (samantha)