Jr NTR కొత్త యాడ్ షూట్.. క్రేజీ పిక్స్!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) చాలా త‌క్కువ‌గా యాడ్స్ చేస్తుంటారు. ఆయ‌న (jr ntr) ఇప్ప‌టివ‌ర‌కు చేసింది ఒక ఆపీ ఫిజ్, లిషియ‌స్, న‌వర‌త్న ఆయిల్, సెలెక్ట్, ఓట్టో వంటి యాడ్స్‌లో మాత్ర‌మే. అది కూడా ఇలాంటి యాడ్ షూట్స్‌లో ఏడాదికి ఓసారి పాల్గొంటూ ఉంటారు. నార్మ‌ల్‌గా ఆయ‌న నుంచి ఫొటోషూట్ పిక్స్ రావ‌డం చాలా త‌క్కువ‌. కేవ‌లం యాడ్ షూట్ టైంలోనే అదిరిపోయే ఫొటోలు బ‌య‌టికి వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌వే ఈ ఫొటోలు. ఇంత‌కీ ఆయ‌న ఏ యాడ్‌కి షూట్ చేస్తున్నారో తెలీలేదు కానీ.. తార‌క్ ఫొటోల‌కు ఇచ్చిన పోజులు మాత్రం అదిరిపోయాయి. ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక మొన్న తార‌క్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దేవ‌ర‌ (devara) టైటిల్, పోస్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్‌లుక్‌కే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసారు కొర‌టాల‌ (koratala siva). ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చిందంటే.. అనిరుధ్ (anirudh ravichander) ఏ రేంజ్‌లో BGM ఇచ్చారో తెలిసిపోతుంది. ఇందులో జాన్వి క‌పూర్ (janhvi kapoor) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) విల‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు.