NTR: రెస్ట్ తీస్కోండి స‌ర్.. త్వ‌ర‌లో క‌లుద్దాం..!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(jr ntr) ఫైన‌ల్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు. య‌ష్ రాజ్ ఫిలింస్ తీస్తున్న స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా వార్‌-2(war 2) సినిమా రాబోతోంది. ఇందులో బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోష‌న్(hrithik roshan) హీరోగా.. తార‌క్ విల‌న్‌గా న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే.. సినిమా గురించి తారక్(tarak) చేసిన ట్వీట్‌కి ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ వ‌చ్చేస్తున్నాయ్. ఈరోజు తార‌క్(jr ntr) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హృతిక్‌.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు మిత్ర‌మా అంటూ తెలుగులో విషెస్ చెప్పారు. ఈ ట్వీట్‌కి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ.. “థ్యాంక్యూ సోమ‌చ్ స‌ర్. ఈరోజంతా ఆనందంతో మునిగితేలుతాను. మీరు రోజులు కూడా లెక్క‌పెట్టుకోవాలి. ఏం జ‌ర‌గ‌బోతోందో ఆలోచిస్తూ మీరు బాగా నిద్ర‌పోవాలి. ఎందుకంటే యుద్ధ‌భూమిలో మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. త్వ‌ర‌లో క‌లుద్దాం” అని ట్వీట్ చేసారు. ఈ ఒక్క ట్వీట్‌తో.. వార్‌-2 ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో తార‌క్ ఫ్యాన్స్ ఊహ‌కే వ‌దిలేసారు. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసిన‌ట్లున్నారు. ఇక వార్-2లో ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మాస్త్ర ఫేం అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. హృతిక్‌, ఎన్టీఆర్ ట్వీట్స్‌ని బ‌ట్టి చూస్తే హై యాక్ష‌న్ వోల్టేజ్ సినిమా రేంజ్‌లో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.