Payal Ghosh: సినిమాల కోసం ప‌డుకోవాల్సిన అవ‌స‌రం లేదు

Payal Ghosh: తాను సినిమా అవ‌కాశాల కోసం ప‌డుకోవ‌డం.. వారు చెప్పిన‌ట్లు న‌డుచుకోవ‌డం వంటి ప‌నులు అస్స‌లు చేయ‌న‌ని అన్నారు పాయ‌ల్ ఘోష్‌. సినిమా అవ‌కాశాలు లేక ఎన్టీఆర్ (jr ntr) గురించి ప్ర‌స్తావిస్తూ ప‌బ్లిసిటీ వ‌స్తుందేమోన‌ని ఏవేవో ట్వీట్లు పెడుతున్న పాయ‌ల్ ఘోష్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అవ‌కాశాలు కావాలంటే నేరుగా డైరెక్ట‌ర్లు, నిర్మాత‌ల‌ను అడ‌గండి.. అయినా మీలాంటివారు ఛాన్సుల కోసం ఎవ‌రితోనైనా ప‌డుకుంటారు క‌దా అని కామెంట్స్ పెడుతుండ‌డంతో ఆమె స్పందించారు. అవ‌కాశాలు రానంత మాత్రాన త‌న‌ని తాము అమ్ముకోన‌ని స్ప‌ష్టం చేసారు. తెలుగులో ఊస‌ర‌వెల్లి, ప్ర‌యాణం సినిమాల్లో న‌టించారు పాయ‌ల్.