Anasuya Bharadwaj: గుమ్మ‌డికాయ దొంగ‌ల‌కు ఇది న‌చ్చ‌క‌పోవ‌చ్చు

Anasuya Bharadwaj: వీళ్లే నా నిజ‌మైన అభిమానులు అంటూ వారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసారు యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్. అన‌సూయ స్టాన్ అనే ట్విట‌ర్ పేజ్‌లో ఒక అమ్మాయి గురించి గొప్ప‌గా ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వారే త‌న అస‌లైన అభిమానులు అని అన‌సూయ అన్నారు.

“” నా అస‌లైన అభిమానులు. కొన్ని ఫ్యాన్ పేజీల లాగా ఎవ‌రి గురించీ అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌రు. ఎవ‌రినీ టార్గెట్ చేయ‌రు. ఎవ‌రినీ రెచ్చ‌గొట్ట‌రు. అన‌వ‌స‌రంగా ఎవ‌రినీ అగౌర‌వ‌ప‌ర‌చ‌రు. దేనినీ ఉన్న‌ది లేన‌ట్లుగా లేనిది ఉన్న‌ట్లుగా చూపించ‌రు. బాధ్య‌త విష‌యానికొస్తే పారిపోరు. వీరే నా బ‌లం. వీరి ప‌ట్ల నాకు గ‌ర్వంగా ఉంది. ఇప్పుడు కొంద‌రు గుమ్మ‌డికాయ దొంగ‌లు ఈ ట్వీట్ చూసి పిచ్చెక్కిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అయినా ఏం ఫ‌ర్వాలేదు. ఎందుకంటే నాతో స‌రైన వాళ్లు ఉన్నారు. నేను వారికి అండ‌గా ఉంటాను “” అని ట్వీట్ చేసారు.

Anasuya Bharadwaj: ఎవ‌రు ఏ మాఫియా చేస్తున్నారో నేను ముందే చెప్పాను