Anasuya: బంగారుకొండ‌లూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కౌంట‌ర్

Hyderabad: యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్(anasuya) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. అయితే కొన్ని వివాదాలు మాత్రం ఆవిడ(anasuya) కావాల‌నే కొనితెచ్చ‌కున్నారేమో అన్న‌ట్లుగా ఉంటాయి. ఇప్పుడు జ‌రిగిన వివాదం కూడా అలాంటిదే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌(vijay devarakonda), స‌మంత(samantha) జంట‌గా న‌టించిన ఖుషి సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజైంది. అందులో టైటిల్ కార్డుపై విజయ్ దేవ‌ర‌కొండ‌కి బదులు “ది” విజ‌య్ దేవ‌ర‌కొండ అని రాసి ఉంది. సాధార‌ణంగా టాప్ బ్రాండ్స్‌కి ది అనే ప‌దాన్ని యాడ్ చేస్తారు. దీని గురించి అన‌సూయ కామెంట్ చేసారు. “ఇప్పుడే ఒక‌టి చూసాను. ది అంట. బాబోయ్. దీన్నే పైత్యం అంటారు. ఏం చేస్తాం. అంట‌కుండా చూసుకుందాం” అని కామెంట్ చేసారు. అయితే ఆమె ఎవ‌రి గురించి అంటున్నార‌ని చెప్ప‌క‌పోయినా ఖుషి టీజ‌ర్ రిలీజైన కాసేప‌టికే ఈ ట్వీట్ చేయ‌డంతో అంతా విజ‌య్ గురించే అని ఫిక్స్ అయిపోయారు. దాంతో అన‌సూయ‌ను విజ‌య్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. విజయ్ కోసం రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ.. “భ‌లే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ‌..ఊప్స్ బంగారుకొండ‌లంట‌..ఎక్కడో అక్క‌డ నేను నిజం అన్నది నిరూపిస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలూ” అని మ‌రో ట్వీట్ పెట్టారు. దాంతో అన‌సూయ కామెంట్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించే అని చెప్ప‌క‌నే చెప్పేసింది అన‌సూయ‌.