Poonam Kaur కామెంట్ అన‌సూయ గురించేనా?

ఏడుస్తూ సోష‌ల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి వైర‌ల్ అయ్యారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్ (anasuya bharadwaj). అంద‌రూ ఆమె సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌స్తున్న నెగిటివిటీ, ట్రోలింగ్ త‌ట్టుకోలేక అలా ఏడుస్తున్నార‌ని అనుకున్నారు. కానీ తాను ఏడుస్తున్న‌ది ట్రోలింగ్ వ‌ల్ల కాద‌ని కాసేప‌టికే కారులో వెళ్తూ న‌వ్వుకుంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. దాంతో అన‌సూయ‌పై ట్రోలింగ్ మ‌రింత ఎక్కువైంది. తాను అటెన్ష‌న్ కోస‌మే ఇలా చేస్తున్నాన‌ని చెప్తూ అంద‌రి ముందు త‌న ప‌రువు త‌నే తీసుకుంది. అయితే ఇప్పుడు అన‌సూయ‌కు ఇన్‌డైరెక్ట్‌గా స‌పోర్ట్ చేస్తూ న‌టి పూన‌మ్ కౌర్ (poonam kaur) ఓ పోస్ట్ పెట్టారు. అన‌సూయ యాంక‌రింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన సంఘ‌ట‌న గురించి పూనమ్ అంద‌రితో షేర్ చేసుకున్నారు.

పూన‌మ్ కౌర్ పోస్ట్

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చి ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసిన అమ్మాయి గురించి మాట్లాడాల‌నుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు ఈవెంట్ మ‌లేషియాలో జరుగింది. దానికి న‌న్ను గెస్ట్‌గా పిలిచారు. నేను వెళ్లాను. ఆ ఈవెంట్‌కు దాదాపు 600 మంది వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఓ అమ్మాయి నా ద‌గ్గ‌రికి వ‌చ్చి కొన్ని ప్ర‌శ్న‌లు వేసింది. నాకు ఆ అమ్మాయిని చూసాక ఏదో తెలీని ఫీలింగ్ క‌లిగింది. ఈవెంట్‌లో అటు ఇటు తిరుగుతూనే ఉంది. జ‌నాల మ‌ధ్య‌లో నుంచి దూరి వెళ్తోంది. కానీ అక్క‌డున్న‌వారు మాత్రం స‌రిగ్గా బిహేవ్ చేయడంలేదు. అయినా కామ్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లింది. ఆ అమ్మాయికి ఏమీ కాకూడ‌ద‌ని నేను దేవుడిని ప్రార్థిస్తూ త‌న‌ను గ‌మ‌నిస్తూ ఉన్నాను. అది నా దేశం కాదు కాబ‌ట్టి నేను రియాక్ట్ అవ్వ‌లేదు. ఎంద‌రో పెద్ద వాళ్లు డామినేట్ చేస్తున్న రంగంలోకి యాంక‌ర్‌గా వ‌చ్చి రాణించ‌డం అనేది చిన్న విష‌యం కాదు.

గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఆ మ‌హిళ త‌న చుట్టూ ఉన్న‌వారి నుంచి ప్రేమ‌, కేరింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కానీ త‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. అయిన‌ప్ప‌టికీ త‌న స‌క్సెస్‌ఫుల్ కెరీర్ ప‌ట్ల నేను ఎంతో సంతోషించేదాన్ని. కానీ త‌ను ట్రోలింగ్ వ‌ల్ల ఎంతో బాధ‌ప‌డుతూ ఇలా ఏడుస్తుండ‌డం చూసి త‌న స్టోరీ మీతో షేర్ చేసుకోవాల‌ని అనుకున్నాను. నాకు తను పర్స‌న‌ల్‌గా తెలీదు. త‌న జీవితంలో ఎలాంటి గొడ‌వ‌లు ఉన్నాయో కూడా తెలీదు. త‌ను నా ఫ్రెండ్ కూడా కాదు కానీ ఇలా ట్రోలింగ్ చేయ‌డం మాత్రం స‌రికాదు. త‌ను ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి, ఒక ఇంటి కోడ‌లు, ఒక‌రి కూతురు అన్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోండి అని పేర్కొన్నారు పూన‌మ్ (poonam kaur)