ఉద్యోగానికి రాజీనామా చేసి.. బాస్ ముందు డ్యాన్స్!

Viral News:  విష‌పూరిత‌మైన వ‌ర్క్ క‌ల్చ‌ర్ వ‌ల్ల త‌ట్టుకోలేక‌పోయిన ఓ ఉద్యోగి.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. ఇందులో వింతేముంది? అత‌నికి ప‌ని న‌చ్చ‌లేదు కాబ‌ట్టి రాజీనామా చేసుంటాడు అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. రాజీనామా చేసాక ఏ ఉద్యోగీ చేయ‌ని ప‌ని అత‌ను చేసి చూపించాడు. ఇంత‌కీ ఏం చేసాడో తెలుసా? రాజీనామా చేసిన త‌ర్వాత బాస్‌ని బ‌య‌టికి పిలిపించి తాను ముందుగానే పిలిపించుకున్న బ్యాండ్‌ను తెప్పించుకుని డ్యాన్స్ చేసి మ‌రీ సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

బాయ్ బాయ్ స‌ర్ అంటూ బాస్ ప‌రువు తీసేసాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.  2023లో హ‌రప్ప ఇన్‌సైట్స్ రిలీజ్ చేసిన సర్వే ప్ర‌కారం 58 శాతం మంది ఉద్యోగులు త‌మ య‌జ‌మానుల ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క మానేస్తున్నార‌ని, మ‌రో 54 శాతం మంది ద్వేష‌పూరిత‌మైన వాతావర‌ణంలో ప‌నిచేయలేక మానేస్తున్నార‌ని తేలింది.