నా న‌డుం ప‌ట్టుకుని లాగేసారు.. సీఎం రేవంత్ చూస్తుండిపోయారు

Barkha Dutt: ప్ర‌ముఖ నేష‌న‌ల్ మీడియా జ‌ర్న‌లిస్ట్ బార్కా ద‌త్.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు. ఆయ‌న‌తో మాట్లాడుతుండగా అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది త‌న‌ను త‌న కెమెరామ్యాన్‌ని ప‌క్క‌కు తోసేసార‌ని, కెమెరా సామాగ్రి విరిగిపోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఆడ‌దాన్న‌ని కూడా చూడ‌కుండా న‌డుం ప‌ట్టుకుని ప‌క్క‌కు లాగేసార‌ని..ఇదంతా చూస్తున్న సీఎం రేవంత్ ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డాన్ని చూస్తుంటే.. అధికారం చేతిలో ఉంటే రాజ‌కీయ నాయ‌కుడు ఇలాగే ఉంటాడ‌న్న సందేహం క‌లుగుతోంద‌ని ఆమె ట్విట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసారు.