Money: మురికి కాలువ‌లో నోట్ల క‌ట్ట‌లు..!

Bihar: మురికి కాలువ‌లో(drainage canal) నోట్ల క‌ట్ట‌లు(money) దొరికిన ఘ‌ట‌న బిహార్‌(bihar)లో చోటుచేసుకుంది. రోహ్తాస్ జిల్లాలో నిన్న ఓ డ్రైనేజీ కాలువలో నోట్ల క‌ట్టలు కొట్టుకువ‌స్తుండడం స్థానికులు గ‌మ‌నించారు. వెంటనే కాలువ‌లోకి దూకి అందినంత డ‌బ్బు తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. దాంతో అధికారుల‌కు విష‌యం తెలిసింది. అస‌లు ఆ డ‌బ్బు డ్రైనేజ్‌లోకి ఎలా వ‌చ్చిందో వెంటనే విచారించాల్సిందిగా పాట్నా పోలీసుల‌ను ఆదేశించారు.