Malla Reddy: కాంగ్రెస్‌లో చేర్చుకోండి సార్..!

Malla Reddy: BRS ఎమ్మెల్యే మ‌ల్లా రెడ్డి.. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను (DK Shiva Kumar) క‌లిసారు. కొంత‌కాలంగా మ‌ల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విష‌య‌మై మీడియా వ‌ర్గాలు అడిగితే.. అందులో ఏమాత్రం నిజం లేద‌ని అన్నారు. కొంత‌కాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మ‌ల్లారెడ్డిని అత‌ని అల్లుడిని టార్చ‌ర్ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అక్ర‌మంగా నిర్మించిన క‌ట్ట‌డాలు అంటూ వారికి చెందిన క‌ళాశాల భ‌వ‌నాల‌ను క‌ట్ట‌డాల‌ను కూల్చేస్తున్నారు. దాంతో వేరే ఆప్ష‌న్ లేక ఇక దొరికిపోయాం రా బాబూ అన్న‌ట్లు మ‌ల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే మ‌ల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డం రేవంత్ రెడ్డికి కానీ ఇత‌ర తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు కానీ ఇష్టం లేదు. దాంతో కాంగ్రెస్ హైక‌మాండ్‌ను క‌ల‌వ‌లేక మ‌ల్లారెడ్డి డీకే శివ‌కుమార్‌ను క‌లిసారు. ఎలాగైనా న‌న్ను కాంగ్రెస్‌లో చేర్చుకునేలా న‌చ్చ‌జెప్పండి స‌ర్ అని రిక్వెస్ట్ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ALSO READ: Pawan Kalyan: అందుకే ఎవ‌రు తిట్టినా నాకు సిగ్గు అనిపించ‌దు

ALSO READ: Pawan Kalyan: అస‌లైన అంద‌రివాడు..!

ALSO READ: Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు కరెంట్ కష్టాలు!