“టీ20 కెప్టెన్‌గా రోహిత్ ప‌నికిరాడు”

Rohit Sharma: త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు సార‌థ్యం వ‌హించ‌డానికి రోహిత్ శ‌ర్మ ప‌నికిరాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు కల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ మాజీ డైరెక్ట‌ర్ జాయ్ భ‌ట్టాచార్య‌. వెస్ట్ ఇండీస్, అమెరికాలో జ‌ర‌గ‌నున్న ఈ గ్లోబ‌ల్ టోర్న‌మెంట్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొన‌బోతున్నార‌న్న విష‌యంపై ఏప్రిల్ 30న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌లు మీటింగ్ పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శ‌ర్మ‌ను టీ20 క‌ప్ కెప్టెన్‌గా చేయ‌డం మంచిది కాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. టీ20 ఫార్మాట్‌లో ఓపెన‌ర్‌గా రోహిత్ ఆట బాగాలేద‌ని ప్ర‌స్తుతానికి అత‌ను బ్యాటింగ్ ఫాంలోనే లేడ‌ని అన్నారు. రోహిత్‌కి బ‌దులు విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్, శుభ్‌మ‌న్ గిల్ అయితే స‌రిపోతార‌ని తెలిపారు.